: సాక్షి మహరాజ్ చెబుతున్న కొత్త జనాభా విధానంపై ప్రధాని వివరణ ఇవ్వాలి!: కాంగ్రెస్


సాక్షి మహరాజ్ చెబుతున్న కొత్త జనాభా విధానం గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నోరువిప్పాలని, ప్రజలకు వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సంఘ్వీ సూచించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ముగ్గురూ సాక్షి మహరాజ్ ప్రతిపాదించిన జనాభా విధానం దేశవిధానమని ప్రకటించాలని ఆయన సవాల్ విసిరారు. అధికార పార్టీలో ఎలాంటి వారు ఉన్నారో ప్రజలు చూస్తున్నారని, అధికార గర్వం ఎలాంటి విపరీతాలకు దారి తీస్తుందో అంతా గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. బీజేపీ నేతలు సాక్షి మహరాజ్ వ్యాఖ్యలపై ఏమంటారో చూడాలని ఆయన సూచించారు. ప్రధాని స్పందించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News