: ప్రసాదం తిని వీరు అపస్మారక స్థితిలోకి వెళ్లారు... వారు దోచుకున్నారు!


దేవుడి ప్రసాదం అంటూ అపరిచితులు పెట్టిన ఆహారాన్ని తిని 150 మంది అపస్మారక స్థితిలోకి వెళ్ళగా, దుండగులు దర్జాగా వారిని దోచుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని అహర్ పట్టణంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గంగా నది ఒడ్డున ఉన్న ఓ కమ్యూనిటీ గెస్ట్ హౌస్ లో సమావేశమైన వారికి ముగ్గురు అపరిచిత వ్యక్తులు 'ప్రసాదం' అంటూ బిస్కెట్లు, టీ ఇచ్చారు. ఆపై వారంతా మత్తులోకి జారుకోగా, అందరి వద్ద ఉన్న డబ్బు, నగలు, సెల్ ఫోన్ లను దుండగులు దోచుకుపోయారు. అపస్మారక స్థితిలోకి వెళ్ళిన వారిలో ముగ్గురి పరిస్థితి కాస్త విషమంగా ఉంది. దుండగులను అదుపులోకి తీసుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News