: నోబెల్ పురస్కారాన్ని జాతికి అంకితం చేసిన కైలాష్ సత్యార్థి


బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్ సత్యార్థి తన నోబెల్ శాంతి పురస్కారాన్ని ఈరోజు జాతికి అంకితం చేశారు. ఈ మేరకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ప్రణబ్ ముఖర్జీని కలసిన ఆయన తన నోబెల్ మెడల్ ను సమర్పించారు. 24 క్యారెట్ల బంగారంతో తయారైన ఈ మెడల్ 175 గ్రాముల బరువు ఉంటుంది. భారత్ లో బాలల హక్కుల కోసం పోరాడినందుకుగానూ సత్యార్థికి నోబెల్ కమిటీ ఈ పురస్కారం ప్రకటించింది. డిసెంబర్ 10న పాకిస్థాన్ బాలిక మలాలా యూసఫ్ జాయ్ తో కలిసి ఆయన నోబెల్ శాంతి పురస్కారం అందుకున్నారు.

  • Loading...

More Telugu News