: భారత్ ను పేదదేశంగా ప్రపంచం ఎక్కువ కాలం చూడబోదు: సుష్మ
భారతదేశాన్ని ప్రపంచదేశాలు పేదదేశంగా ఎక్కువ కాలం చూడబోవని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు. గుజరాత్ లోని గాంధీనగర్ లో 13వ ప్రవాస భారతీయ దివస్ ను ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నవభారత నిర్మాణానికి యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం భారతదేశం యువశక్తితో నిండి ఉందని, యువత మొత్తం నవభారత నిర్మాణానికి సహకరించాలని ఆమె ఆకాంక్షించారు. భారత్ ఎదుగుతున్న ప్రబల శక్తి అని ఆమె పేర్కొన్నారు. ప్రజాస్వామ్య భారతదేశానికి కీలకమైనది యువశక్తేనని ఆమె తెలిపారు.