: రాష్ట్రాలు సమష్టిగా ఎదిగితే దేశం ముందుకుపోతుంది: జైట్లీ
దేశ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కోల్ కతాలో జరిగిన పశ్చిమ బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ లో మాట్లాడుతూ, రాష్ట్రాలు సమష్టిగా ఎదిగితే దేశం కూడా పురోగామి పథంలో దూసుకెళుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల పెట్టుబడిలో ప్రతి రూపాయికి కేంద్రం దన్నుగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రాలన్నీ రాజకీయ విభేదాలు పక్కనబెట్టి జాతీయ ప్రయోజనాల కోసం కలసికట్టుగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రణాళిక సంఘం స్థానంలో కొత్తగా ఏర్పడిన 'నీతి ఆయోగ్' రాష్ట్రాలను ఆర్థికంగా బలోపేతం చేస్తుందన్నారు. ఇక, పశ్చిమ బెంగాల్ గురించి మాట్లాడుతూ, మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేలా వస్తు ఉత్పాదన రంగాన్ని విస్తరించాలని సర్కారుకు సూచించారు.