: ఇండియాకు వెళ్తున్నారా? ఉగ్ర దాడి జరగొచ్చు, జాగ్రత్త!: ఆస్ట్రేలియా


ఇండియాకు వెళుతున్న ఆస్ట్రేలియన్లు తమ తమ భద్రతపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆ దేశ ప్రభుత్వం సూచించింది. భారత్ లో ఉగ్రవాద కదలికలు ఉన్నాయని, పెద్ద పెద్ద హోటల్స్ పై దాడులు జరిగే ప్రమాదముందని హెచ్చరికలు చేసింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాలు, వాణిజ్య విభాగం ఇండియాకు వెళుతున్న వారికి సలహాలు ఇస్తూ, ఆ దేశంలో నేరాలు, రహదారి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపింది. ఇండియాలో ఆస్ట్రేలియన్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎక్కడైనా, ఎప్పుడైనా ఉగ్ర దాడి జరగవచ్చని సమాచారం అందినట్టు పేర్కొంది.

  • Loading...

More Telugu News