: ‘మడకశిర’పై బాలయ్య స్పందన... బాధితులకు సత్వర వైద్యసేవలందించాలని ఆదేశం
అనంతపురం జిల్లా మడకశిర ప్రమాదంపై టాలీవుడ్ ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం గురించిన సమాచారం తెలియగానే స్పందించిన ఆయన వెనువెంటనే స్థానిక అధికారులకు ఫోన్ చేశారు. ప్రమాదంలో గాయపడ్డవారికి సత్వర వైద్యసేవలందించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదం జరిగిన తీరును ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో మృత్యువాతపడ్డ వారిలో తొమ్మిది మంది విద్యార్థులున్నారని తెలుసుకున్న బాలయ్య షాక్ కు గురయ్యారు. ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాలతో పాటు క్షతగాత్రులకు కూడా ప్రభుత్వం నుంచి ఎక్స్ గ్రేషియా అందుతుందని ఈ సందర్భంగా బాలయ్య ప్రకటించారు.