: మడకశిర బస్సు ప్రమాదంపై విచారణకు ప్రభుత్వం ఆదేశాలు
అనంతపురం జిల్లా మడకశిర బస్సు ప్రమాదంపై ఏపీ సర్కారు విచారణకు ఆదేశించింది. దాదాపు 60 మంది ప్రయాణికులతో మడకశిర నుంచి పెనుగొండ బయలుదేరిన ఆర్టీసీ బస్సు లోయలో పడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటికే 14 మంది చనిపోగా, 20 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 13 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. ప్రమాదంపై ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరపాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.