: సెలవు పొడిగించమంటూ సంజయ్ దత్ దరఖాస్తు


మరో 14 రోజుల సెలవు కావాలని కోరుతూ నటుడు సంజయ్ దత్ ఎరవాడ జైలు అధికారులకు దరఖాస్తు పెట్టుకున్నాడు. డిసెంబర్ 24న జైలు నుంచి బయటికి వచ్చిన సంజయ్ పద్నాలుగు రోజుల తాత్కాలిక సెలవుపై కుటుంబ సభ్యులతో గడుపుతున్నాడు. అది కాస్తా ముగియనుండటంతో తాజాగా మరోసారి దరఖాస్తు చేశాడు. ఈ మేరకు ఎరవాడ జైలు సూపరింటెండెంట్ యోగేష్ దేశాయ్ మాట్లాడుతూ, "తాత్కాలిక సెలవుపై బయటికి వెళ్లిన ప్రతి ఒక్క ఖైదీకి సెలవు పొడిగించాలని కోరే హక్కు ఉంది. తన (సంజయ్) దరఖాస్తు మాకు అందింది. ప్రస్తుతం ప్రక్రియ కొనసాగుతోంది" అని తెలిపారు.

  • Loading...

More Telugu News