: ప్రతి హిందూ స్త్రీ నలుగురు పిల్లల్ని కనాలి: సాక్షి మహారాజ్


తీవ్ర వ్యాఖ్యలు చేయడంలో ముందుండే బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ మరోమారు తనదైన శైలిలో మాట్లాడారు. ప్రతి హిందూ మహిళ కనీసం నలుగురు పిల్లల్ని కనాలని పిలుపునిచ్చారు. మీరట్ లో జరిగిన సంత్ సమాగమ్ మహోత్సవ్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్య చేశారు. పరోక్షంగా ఇస్లాంపై విమర్శలు గుప్పిస్తూ, "నలుగురు భార్యలు, 40 మంది పిల్లల సిద్ధాంతం భారత్ లో చెల్లుబాటు కాదు. ఇప్పుడు హిందూ మహిళలు కూడా నలుగురు పిల్లలను కనాల్సిన తరుణం ఆసన్నమైంది. హిందూ మతాన్ని రక్షించుకోవాలంటే నలుగురు పిల్లల్ని కనడం తప్పనిసరి" అని అన్నారు. మతమార్పిడికి పాల్పడిన వారికి మరణశిక్ష డిమాండ్ పైనా ఆయన స్పందించారు. వేచి చూడాలని, గోవులను వధించే వారికి, మతమార్పిళ్లకు పాల్పడే వారికి మరణశిక్ష విధించేలా పార్లమెంటులో చట్టం చేస్తారని అన్నారు. ఇక, అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని ఈ భూమండలంపై ఏ శక్తి కూడా అడ్డుకోలేదని మహారాజ్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News