: ముక్కోణపు సిరీస్ లో పాల్గొనే జట్టులోనూ యువీకి 'నో ప్లేస్'
వరల్డ్ కప్ లో పాల్గొనే టీమిండియాను ప్రకటించిన సెలక్టర్లు ముక్కోణపు సిరీస్ కు కూడా జట్టును ఎంపిక చేశారు. సిడ్నీ టెస్టు ముగిసిన తర్వాత ఆస్ట్రేలియాలో ముక్కోణపు సిరీస్ ఆరంభమవుతుంది. ఆతిథ్య ఆసీస్ తో పాటు భారత్, ఇంగ్లాండ్ జట్లు పాల్గొనే ఈ ట్రయాంగులర్ ఈవెంట్ జనవరి 16 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరుగుతుంది. ఇందులో పాల్గొనే టీమిండియా జట్టులో పేసర్లు మోహిత్ శర్మ, ధవళ్ కులకర్ణిలకు చోటు దక్కింది. ప్రస్తుతం భీకర ఫాంలో ఉన్న యువరాజ్ సింగ్ ను సెలక్టర్లు ఈ జట్టుకూ ఎంపిక చేయలేదు. జట్టు సభ్యులు ఎంఎస్ ధోనీ (కెప్టెన్/వికెట్ కీపర్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, అజింక్యా రహానే, విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమి, ఉమేశ్ యాదవ్, స్టూవర్ట్ బిన్నీ, అక్షర్ పటేల్, మోహిత్ శర్మ, ధవళ్ కులకర్ణి.