: చంద్రబాబు కాన్వాయ్ లో కార్లు మారాయి... కానీ నెంబర్లు మారలేదు!


ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పక్కా పాలనాదక్షుడైనా, ఆయనకూ కొన్ని పట్టింపులున్నాయి. కొన్ని విషయాల్లో మార్పులను ఆయన అస్సలు సహించరు. 20 ఏళ్లుగా చంద్రబాబును పరిశీలిస్తే, ఇది వాస్తవమేనని ఒప్పకోక తప్పదు. ఎందుకంటే, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఆయన అంబాసిడర్ కార్లతో కూడిన కాన్వాయ్ ని వాడుతున్న విషయం తెలిసిందే. ఆ కాన్వాయ్ లోని వాహనాల నెంబర్ ప్లేట్లన్నింటిపై ‘ఏపీ 9జీ 393’ నెంబర్ దర్శనమిస్తుంది. తాజాగా చంద్రబాబు కాన్వాయ్ లో అంబాసిడర్ల స్థానంలో టాటా సఫారీలు వచ్చి చేరాయి. అయితే కొత్త వాహనాల నెంబర్ ప్లేట్లపైనా పాత నెంబరే దర్శనమిస్తోంది. మొత్తం అన్ని వాహనాల నెంబర్ ను ఏపీ 9జీ 393గానే కొనసాగించేందుకు చంద్రబాబు నిర్ణయించుకున్నారు. అలిపిరి ఘటనలో నక్సల్స్ బాంబు దాడికి గురైన సమయంలోనూ చంద్రబాబు కారు నెంబరు ఏపీ 9జీ 393గానే ఉంది. ప్రమాదం తర్వాత కూడా ఆయన తన కారు నెంబరును మార్చకపోవడం విశేషం.

  • Loading...

More Telugu News