: ఏపీలో భారీ ఎత్తున ఐఏఎస్ అధికారుల బదిలీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ఎత్తున ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఏకంగా 37 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ గత అర్ధరాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి. హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా అనిల్ చంద్ర పునీత నియమితులయ్యారు. అలాగే, వ్యవసాయ శాఖ కార్యదర్శిగా ప్రేమచంద్రా రెడ్డి, పరిశ్రమల శాఖ కార్యదర్శిగా శంషేర్ సింగ్ రావత్, మార్కెటింగ్ శాఖ కమిషనర్ గా బి.కిశోర్, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిగా అనురాధ, ఉద్యాన శాఖ కమిషనర్ గా ఉషారాణి, ఎక్సైజ్ శాఖ కమిషనర్ గా శ్రీనివాస్ శ్రీనరేష్, ఖనిజాభివృద్ధి ఎండీగా గిరిజా శంకర్, కృష్ణా జిల్లా కలెక్టర్ గా ఎ.బాబు, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గా లక్ష్మీనరసింహం బదిలీ అయ్యారు.