: టీఎంసీ సభ్యత్వానికి యాభై వేల ఫీజు


పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఏది చేసినా సంచలనమే. తాజాగా ఆమె తీసుకున్న నిర్ణయం దేశ వ్యాప్తంగా చర్చను లేవనెత్తుతోంది. తృణమూల్ లో జీవిత కాల సభ్యత్వం తీసుకోవాలంటే రూ. 50 వేలు చెల్లించాలని నిర్ణయించారు. అలాగే, అసోసియేట్ సభ్యత్వానికి రూ. 30 వేలు, క్రియాశీల సభ్యత్వానికి రూ. 19,500 చెల్లించాలి. ఇప్పటి వరకు జీవితకాల సభ్యత్వం కోసం వంద మంది దరఖాస్తు చేసుకున్నారట. సభ్యత్వాల ద్వారా రూ. 200 కోట్లను సేకరించాలని తృణమూల్ భావిస్తోంది. ఈ నిర్ణయం విపక్షాల నోటికి పని కల్పించింది. శారదా స్కాంలో వచ్చిన డబ్బును రెగ్యులరైజ్ చేసుకోవడానికే మమతా బెనర్జీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. క్లబ్ లలో అయితే జీవిత కాల సభ్యత్వాలు ఉంటాయని, రాజకీయ పార్టీలలో ఉండవని సీపీఎం దుమ్మెత్తి పోసింది. ఒక్క రూపాయ జీతం కూడా తీసుకోని మమతా బెనర్జీ పార్టీ సభ్యత్వాన్ని ఎలా తీసుకోగలరని కాంగ్రెస్ పార్టీ వ్యంగ్యాస్త్రాలు విసిరింది.

  • Loading...

More Telugu News