: హోటల్లో పాత్రలు కడిగా: మంత్రిగారి గత 'స్మృతి'
కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ గతానుభవాలను మంగళవారం నెమరువేసుకున్నారు. రాష్ట్రాల విద్యాశాఖ మంత్రుల సదస్సు సందర్భంగా ‘మేకిన్ ఇండియా’పై ఆమె కీలక ప్రసంగం చేశారు. వృత్తిపరంగా కూలీని కూడా గౌరవించినప్పుడే మేకిన్ ఇండియా కల సాకారమవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. ‘‘నేను 15 ఏళ్ల కిందట ముంబైలో అడుగుపెట్టినప్పుడు ఓ హోటల్ లో పాత్రలు కడిగా. ఆ విషయం చెప్పేందుకు నేనేమీ సిగ్గుపడటం లేదు. వృత్తి ఏదైనా గౌరవం చూపాల్సిందే’’ అని ఆమె చెప్పారు. ప్రతి ఒక్కరూ తాము చేసే పనిని గౌరవించాలని ఆమె పిలుపునిచ్చారు.