: ఈఫిల్ టవర్ చూడాలనుకుంటున్నారా?...అయితే యానాం పదండి!


విశ్వవిఖ్యాత ఈఫిల్ టవర్ ను చూడాలనుకుంటున్నారా... అయితే యానాం పదండి. ప్యారిస్ లో ఉన్న ఈఫిల్ టవర్ చూడడానికి యానాం వెళ్లడం ఎందుకు అనుకుంటున్నారా? అక్కడ అచ్చుగుద్దినట్టుండే ఈఫిల్ టవర్ కనిపిస్తుంది కనుక! యానాంలోని గిరియాంపేటలో ఈఫిల్ టవర్ ను పోలిన, ఒబిలిస్క్‌ టవర్ (యానాం టవర్)ను నిర్మించారు. 12 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 45 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని రూపొందించారు. 100.6 మీటర్ల ఎత్తున్న ఈ టవర్ లో పలు ప్రత్యేకతలున్నాయి. టవర్ కింది అంతస్తులో మీటింగ్ హాల్ ఉంది. 53.3 మీటర్ల ఎత్తువరకు లిఫ్ట్ లో వెళ్లొచ్చు. ఈ టవర్ లో 21.6 మీటర్ల ఎత్తులో ఓ రెస్టారెంట్ ఉంది. దానిపైన 26.5 మీటర్ల ఎత్తులో సుదూరతీరాలు తిలకించేందుకు వీక్షణ మందిరం నిర్మించారు. విశాఖను అస్తవ్యస్తం చేసిన 'హుదూద్' లాంటి (250 కిలోమీటర్ల వేగంతో) బలమైన గాలులను సైతం తట్టుకుని నిలబడేలా దీనిని డిజైన్ చేశారు. యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు చొరవతో దీనిని నిర్మించారు. దీనిని పుదుచ్ఛేరి లెఫ్టినెంట్ గవర్నర్ ఎ.అజయ్ కుమార్ సింగ్ ప్రారంభించారు.

  • Loading...

More Telugu News