: 108 కోసం 46.4 కోట్లు విడుదల చేసిన తెలంగాణ
తెలంగాణ ప్రభుత్వం పేదల ఆరోగ్యం కోసం మరింత శ్రద్ధ తీసుకుంటోంది. తెలంగాణ ప్రభుత్వ తొలి ప్రాధామ్యాల్లో పేదల ఆరోగ్యం ఉండడంతో, వారికి వైద్యసేవలు అందించే 108ను బలోపేతం చేసే చర్యలు ప్రారంభించారు. 108 సేవల నిమిత్తం 290 కొత్త వాహనాలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. దీంతో ప్రభుత్వం తక్షణం 46.4 కోట్ల రూపాయలను విడుదల చేసింది. కొత్త వాహనాలు సమకూర్చుకుని మరింత సమర్థవంతమైన సేవలు అందించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.