: ఆ నలుగురికే ప్రపంచకప్ అనుభవం!
వరల్డ్ కప్ లో పాల్గొనే టీమిండియాను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే, భారత జట్టుకు ఎంపికైన తుది 15 మందిలో నలుగురికే ప్రపంచకప్ ఆడిన అనుభవం ఉంది. 2011 వరల్డ్ కప్ లో ఆడిన కెప్టెన్ ధోనీ, విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా, రవిచంద్రన్ అశ్విన్ మాత్రమే తాజా జట్టులో చోటు దక్కించుకున్నారు. భారత్ ఆతిథ్యమిచ్చిన ఆ నాటి వరల్డ్ కప్ లో ఆడిన సచిన్ క్రికెట్ కు వీడ్కోలు పలకగా, సెహ్వాగ్, గంభీర్, యువరాజ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, నెహ్రా, మునాఫ్, యూసుఫ్ పఠాన్, ప్రవీణ్ ఫామ్ లో లేక సతమతమవుతున్నారు. గత వరల్డ్ కప్ టోర్నీలో యువీ తిరుగులేని ఫామ్ తో విధ్వంసం సృష్టించాడు. తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో జట్టు టైటిల్ నెగ్గడంలో ప్రధానపాత్ర పోషించాడు. అలాంటిది, 2015 వరల్డ్ కప్ కు వచ్చేసరికి యువీకి జట్టులో స్థానం లభించకపోవడం గమనార్హం.