: సునంద మరణించిన సంవత్సరం తరువాత ఎఫ్ఐఆర్ దాఖలు ఎందుకు?: కాంగ్రెస్ ప్రశ్న


విషప్రయోగం వల్లనే కేంద్ర మాజీమంత్రి శశిథరూర్ భార్య సునందా పుష్కర్ మరణించారని నేటి ఉదయం వెల్లడించిన పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై హత్యాభియోగం మోపుతూ ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. ఆమె మరణించిన సంవత్సరం తరువాత ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం వెనుక ఉన్న ఉద్దేశాలేమిటో బీజేపీ నేతలు వెల్లడించాలని కాంగ్రెస్ నేత రషీద్ అల్వి డిమాండ్ చేశారు. పోలీసుల తీరు పట్ల ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయని అన్నారు. ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి జరిగే విచారణ ఎవరినీ లక్ష్యంగా చేసుకొని సాగరాదని ఆయన కోరారు. కాగా, సునంద మృతిపై త్వరలోనే శశిథరూర్ ను పోలీసులు విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News