: జగన్ కు ఆ లక్షణాలు లేవు: సోమిరెడ్డి
వైఎస్సార్సీపీ అధినేత జగన్ కు రాజకీయ నాయకుడి లక్షణాలు లేవని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రాజధాని నిర్మాణంపై జగన్ కు అవగాహన లేదని అన్నారు. వైఎస్సార్సీపీలో ఎక్కువగా మాట్లాడేది జగన్, అతని అక్రమాస్తుల కేసుల్లో ఏ2, ఏ3, ఏ4 ముద్దాయిలేనని ఆయన ఎద్దేవా చేశారు. జగన్ ను ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతిపక్షనేతగా ఎన్నుకోలేదని, కేవలం ఎమ్మెల్యేగానే ఎన్నుకున్నారన్న విషయం గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. వైఎస్సార్సీపీకి చెందిన మరో నేతను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవాలని తాను సూచించానని ఆయన చెప్పారు. ఆ పార్టీ నేతలు ఇంకా జగన్ ను ఎందుకు నేతగా భావిస్తున్నారో తనకు అర్థం కావడంలేదని పేర్కొన్నారు. జగన్ ముందు తన భవిష్యత్ గురించి ఆలోచించుకుంటే బాగుంటుందని ఆయన సూచించారు. కేవలం రాజధాని నిర్మాణం అడ్డుకునేందుకే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆయన చెప్పారు.