: నా జ్యోతిష్యం ప్రకారం జగన్ రెండేళ్లలో జైలుకు వెళతాడు: మంత్రి కేఈ
రాజధాని భూములపై వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన విమర్శలపై టీడీపీ ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. రెండేళ్లలో ప్రభుత్వం పడిపోతుందంటూ జగన్ జోతిష్యం చెబుతున్నారని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. ముందు తన భవిష్యత్ గురించి జగన్ ఆలోచించాలని సూచించారు. తన జ్యోతిష్యం ప్రకారం జగన్ రెండేళ్లలో జైలు కెళ్లడం ఖాయమని కేఈ చెప్పారు. ఏదో విధంగా రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారని, ఇడుపులపాయలో రాజధాని పెట్టి ఉంటే జగన్ సంతోషించేవారేమోనని ఎద్దేవా చేశారు. వైసీపీ నుంచి నేతలు ఒక్కొక్కరుగా జారిపోతుండటంతో మిగిలిన నేతలను కాపాడుకునేందుకు జగన్ కుటిలయత్నాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.