: విలనిజం ప్రదర్శించిన దూకుడు, హార్ట్ ఎటాక్, నాయక్ సినిమాల విలన్
దూకుడు, నాయక్, హార్ట్ ఎటాక్ తదితర సినిమాల్లో విలన్ గా నటించిన ఎజాజ్ ఖాన్ బిగ్ బాస్ టీవీ షోలో కూడా విలనిజం చూపించాడు. 'బిగ్ బాస్ 8' సీజన్ లో ప్రవేశపెట్టిన బిగ్ బాస్ హల్లాబోల్ సీజన్ ద్వారా ఛాంపియన్స్ కు ఛాలెంజర్ గా హౌస్ లోకి ప్రవేశించిన ఎజాజ్ ఖాన్ సహ కంటెస్టెంట్ పై చేయిచేసుకున్నాడు. సాధారణంగా అతిగా మాట్లాడే ఎజాజ్ ఖాన్ తనను సహ కంటెస్టెంట్ అలీ ఖులీ మీర్జా ఎగతాళి చేయడంతో తట్టుకోలేకపోయాడు. అతనిపై చేయిచేసుకున్నాడు. మొదట సరదాగా మొదలైన వీరి పోరు, ఎజాజ్ ఖాన్ దురుసు ప్రవర్తన, అనంతరం మీర్జాను ముఖంపై కొట్టడంతో ముగిసింది. నిబంధనలు అతిక్రమించడంతో ఎజాజ్ ఖాన్ ను బిగ్ బిస్ హౌస్ నుంచి బయటకు పంపేశారు. ఛాంపియన్ గా నిలుస్తానని, తాను ఎంటర్ టైనర్ నని బిరుదులిచ్చుకున్న ఎజాజ్ ఖాన్ దురుసు ప్రవర్తన కారణంగా ఉద్వాసనకు గురయ్యాడు. కాగా, ఇదే షోలో గతంలో సోనాలీ రౌత్... అలీ చెంప ఛెళ్లుమనిపించిన సంగతి తెలిసిందే. కలర్స్ టీవీ నిర్వహిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ 6లో ఎజాజ్ ఖాన్ కంటెస్ట్ చేయడం తెలిసిందే.