: ప్రకాశం జిల్లాలో అగ్రిగోల్డ్ ఏజెంట్ ఆత్మహత్య
చెల్లింపులు సరిగా చేయడం లేదంటూ అగ్రిగోల్డ్ యాజమాన్యంపై డిపాజిటర్లు ఫిర్యాదు చేయడం తెలిసిందే. దీంతో, అగ్రిగోల్డ్ చైర్మన్ పై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో, ఖాతాదారులతో పాటు ఏజెంట్లలోనూ ఆందోళన హెచ్చుతోంది. తాజాగా, ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం వేమవరంలో అగ్రిగోల్డ్ ఏజెంట్ సుధాకర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోస్ట్ మాస్టర్ అయిన సుధాకర్ అగ్రిగోల్డ్ ఏజెంట్ గానూ వ్యవహరిస్తున్నాడు. రూ.30 లక్షల మేర డిపాజిట్లు కట్టించిన సుధాకర్, అవి తిరిగిరావన్న ఆందోళనతోనే బలవన్మరణానికి పాల్పడ్డట్టు తెలుస్తోంది.