: షరతుల సర్కారుగా తెలంగాణ ప్రభుత్వం: డీకే అరుణ


తెలంగాణలో ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్ రూం ఫ్లాట్ అంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన టీఆర్ఎస్, తీరా ఆధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఆ ఇళ్ల నిర్మాణానికి రూ.లక్ష కట్టాలని షరతు విధించడం సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ విమర్శించారు. పేదలు రూ.లక్ష కట్టలేకపోతే డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకాన్ని అమలు చేయరా? అని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ పథకాన్ని అటకెక్కించే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ విధంగా షరతులు విధిస్తోందని అరుణ ఆరోపించారు. ఇలా తెలంగాణ ప్రభుత్వం షరతుల సర్కారుగా మారిపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో మంజూరైన బిల్లులను కూడా పెండింగ్ లో పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News