: అగ్రిగోల్డ్ ఎఫెక్ట్... డిపాజిటర్ కు గుండెపోటు!


అధిక వడ్డీల ఆశ చూపిన అగ్రిగోల్డ్ ఏజెంట్ల మాయ మాటలు నమ్మాడు. ఉన్నదంతా పోగేసి డిపాజిట్ చేశాడు. తీరా బాండు గడువు తీరకముందే అగ్రిగోల్డ్ మోసం బయటపడిపోయింది. దీంతో పొదుపు చేసుకున్న సొమ్ము తిరిగిరాదన్న బెంగతో గుండెపోటుకు గురయ్యాడు. అగ్రిగోల్డ్ మోసం నేపథ్యంలో నేటి ఉదయం ప్రకాశం జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని ఎర్రగొండపాలెం మండలం గురిజేపల్లిలో ఎంఆర్పీగా జీవనం సాగిస్తున్న సత్యనారారణ అగ్రిగోల్డ్ లో రూ.70 వేలు పొదుపు చేశారు. అయితే ఆ సంస్థ మోసం నేపథ్యంలో నేటి ఉదయం గుండెపోటుకు గురయ్యారు. ఆస్పత్రిలో చేర్చిన సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News