: అయ్యప్ప భక్తులపై పోలీసుల దాడి... నిలిచిపోయిన శబరి ఎక్స్ ప్రెస్


శబరి ఎక్స్ ప్రెస్ లో అయ్యప్ప భక్తులపై వరుస దాడులు జరుగుతున్నాయి. నిన్నటికి నిన్న అయ్యప్ప భక్తులపై శబరి ఎక్స్ ప్రెస్ పాంట్రికార్ సిబ్బంది దాడికి దిగితే, తాజాగా పోలీసులే భక్తులపై విరుచుకుపడ్డారు. భద్రత కల్పించాల్సిన పోలీసులే తమపై దాడికి దిగడంతో అయ్యప్ప భక్తులు భగ్గుమన్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో శబరి ఎక్స్ ప్రెస్ కేరళలోని షోరనూర్ వద్ద గంటకు పైగా నిలిచిపోయింది. పోలీసుల తీరుపై అయ్యప్ప భక్తులు షోరనూర్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News