: భోజనం బాగాలేదన్న విద్యార్థులను పోలీసులతో కొట్టించిన కాలేజీ యాజమాన్యం


తమకు పెట్టిన భోజనం నాసిరకంగా ఉందని ఫిర్యాదు చేసిన విద్యార్థులను పోలీసులతో కొట్టించింది ఓ కళాశాల యాజమాన్యం. ఈ ఘటన హైదరాబాదు సమీపంలోని హయత్‌ నగర్‌ లోని ఎన్‌ఆర్‌ఐ కళాశాలలో జరిగింది. గత రాత్రి భోజనం బాగా లేదని విద్యార్థులు ఆందోళన చేశారు. ఈ ఘటనపై కాలేజీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు విద్యార్థులను స్టేషన్ కు తీసుకువెళ్లి కొట్టారు. యాజమాన్యం, పోలీసుల వైఖరికి నిరసనగా విద్యార్థులు కళాశాలలోని ఫర్నిచర్‌ ను ధ్వంసం చేశారు. ఈ ఘటనతో హయత్‌ నగర్‌ ప్రాంతంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. యాజమాన్య వైఖరిపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.

  • Loading...

More Telugu News