: 95 పరుగుల వద్ద రోజర్స్ ఔట్


భారత్ తో జరుగుతున్న చివరి టెస్టు తొలి ఇన్నింగ్సులో ఆస్ట్రేలియా 4 పరుగుల వ్యవధిలో ఇద్దరు ఓపెనర్లను కోల్పోయింది. 200 పరుగుల వద్ద వార్నర్ ఔట్ కాగా, 204 పరుగుల వద్ద రోజర్స్ పెవిలియన్ చేరాడు. 13 ఫోర్లతో 95 పరుగులు చేసిన రోజర్స్ తృటిలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. మొహమ్మద్ షమీ విసిరిన గుడ్ లెంగ్త్ బాల్ రోజర్స్ బ్యాట్ ఇన్ సైడ్ ఎడ్జ్ తీసుకుని వికెట్లను గిరాటు వేసింది. ప్రస్తుతం క్రీజులో స్టీవెన్ స్మిత్ (8), షేన్ వాట్సన్ (4)లు ఉన్నారు. ఆసీస్ స్కోరు 2 వికెట్ల నష్టానికి 216 పరుగులు. ఈ రోజు మరో 39 ఓవర్ల ఆట మిగిలి ఉంది.

  • Loading...

More Telugu News