: గుమ్మడికాయల దొంగలెవరంటే... వైసీపీ నేతలు భుజాలు తడుముకుంటున్నారు: మంత్రి నారాయణ


నవ్యాంధ్ర రాజధాని గ్రామాల్లో అగ్ని ప్రమాదానికి సంబంధించి అనుమానితుల విచారణను వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. గుమ్మడికాయల దొంగలెవరంటే... వైసీపీ నేతలు భుజాలు తడుముకుంటున్నారని ఆయన విమర్శించారు. రాజధాని ప్రాంత రైతుల నుంచి ప్రభుత్వం దౌర్జన్యంగా భూములు లాక్కుంటోందంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, గవర్నర్ కు ఫిర్యాదు చేయడంపై నారాయణ సోమవారం తీవ్రంగా స్పందించారు. రాజధాని ప్రాంతంలోని రైతులు, ప్రజలకు భరోసా కల్పించేందుకు ఇటీవల సీఎం చంద్రబాబు అక్కడ పర్యటించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రాజధాని ప్రాంతంలో ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేసేందుకు యత్నించిన వారిని పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని మంత్రి చెప్పారు.

  • Loading...

More Telugu News