: టీడీపీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు


ఎన్నికలు ముగిసి ప్రభుత్వాలు ఏర్పాటైనా ఇరు రాష్ట్రాల్లో రాజకీయ వలసలు మాత్రం ఏమాత్రం ఆగడం లేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇప్పటికే దాదాపు ఖాళీ అయిన ఏపీ కాంగ్రెస్ కు మరో షాక్ తగిలేలా ఉంది. ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు పార్టీ వీడనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యారని వినికిడి. రాష్ట్రాభివృద్ధిలో తాను భాగస్వామినవుతానన్న రుద్రరాజు ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించిన చంద్రబాబు, వీలయినంత త్వరలో పార్టీలోకి రావాలని సాదరంగా ఆహ్వానం పలికారట. దీంతో ఒకటి, రెండు రోజుల్లోనే రుద్రరాజు కాంగ్రెస్ ను వీడి టీడీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News