: ఆసీస్ తో చివరి టెస్టు ప్రారంభం... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
బోర్డర్- గవాస్కర్ టెస్టు సిరీస్ లో భాగంగా నాలుగో (చివరి) టెస్టు మ్యాచ్ కొద్దిసేపటి క్రితం సిడ్నీలో ప్రారంభమైంది. టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుని క్రిస్ రోజర్స్, డేవిడ్ వార్నర్ లతో తన తొలి ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. ఇదిలా ఉంటే తొలి మూడు టెస్టుల్లో విఫలమైన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ పై వేటు పడింది. అతడి స్థానంలో లోకేశ్ రాహుల్ బరిలోకి దిగాడు. ఇక టెస్టు కెరీర్ కు వీడ్కోలు పలికిన మహేంద్ర సింగ్ ధోని స్థానంలో వృద్ధిమాన్ సాహా టీమిండియాలోకి వచ్చాడు. పుజారాకు విశ్రాంతి ఇచ్చిన భారత్, సురేశ్ రైనాకు అవకాశం కల్పించింది. ఇషాంత్ శర్మ రిజర్వ్ బెంచ్ కు పరిమితం కాగా, భువనేశ్వర్ కుమార్ బరిలోకి దిగాడు. ఇక చివరి టెస్టులో ఆసీస్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్ స్థానంలో స్టార్క్ జట్టులోకి వచ్చాడు. 15 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ 80 పరుగులు చేసింది. ఆసీస్ ఓపెనర్లు రోజర్స్ (39), వార్నర్ (35)లు క్రీజులో ఉన్నారు.