: తలపై 3 లక్షలు రివార్డున్న మావో నేత లొంగుబాటు
తలపై 3 లక్షల రూపాయల రివార్డు ఉన్న మావోయిస్టు నేత ఒడిశాలోని పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఒడిశాలోని మావోయిస్టు పార్టీలో సెకండ్ ఇన్ కమాండ్ ప్రమోద్ మాధ్వి అలియాస్ సాగర్ దక్షిణ మండల డీఐజీ అమితాబ్ ఠాకూర్ ఎదుట లొంగిపోయారు. సాగర్ పై ఒడిశాలోని గంజాం, గజపతి, కొందమాల్, రాయ్ గఢ్ జిల్లాల్లో సుమారు 50కి పైగా కేసులు నమోదైనట్టు పోలీసులు తెలిపారు. గతంలో లొంగిపోయిన మావోయిస్టు నేత ఆజాద్ వద్ద సెకండ్ ఇన్ కమాండ్ గా ఉన్న సాగర్, 2011లో ఒడిశా మావోయిస్టు పార్టీలో చేరి మావోయిస్టు నాయకుడు సవ్యసాచి పాండాకు సెకండ్ ఇన్ కమాండ్ గా పని చేశాడు. కాగా, సాగర్ పై 3 లక్షల రివార్డు ఉంది.