: ఆర్డర్ చేసిన వస్తువు మూడు గంటల్లో మీ ముందుకు... ఫ్లిప్ కార్ట్ యత్నం


ఆన్ లైన్లో షాపింగ్ చేస్తే, వస్తువుల డెలివరీకి రోజుల తరబడి ఎదురుచూడకతప్పదు అనుకుంటున్నారా? మీ ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పెట్టే దిశగా ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ప్రణాళికలు రచిస్తోంది. ఆన్ లైన్ లో వస్తువును ఆర్డర్ చేసిన మూడు గంటల్లో దాన్ని మీ ముంగిటికి చేర్చేందుకు ఫ్లిప్ కార్ట్ నడుంబిగించింది. రానున్న జూలై నుంచి మూడు నాలుగు నగరాల్లో మూడు గంటల్లో వస్తువులు డెలివరీ చేసే విధానాన్ని ప్రారంభించనుంది. భారీ స్థాయిలో నిధులు సమకూర్చుకున్న ఫ్లిప్ కార్ట్ అత్యంత తక్కువ వ్యవధిలో వినియోగదారులకు వస్తువులు అందజేసి ఇతర వ్యాపార సంస్థలకు సవాలు విసరనుంది. తాము ఏ వస్తువులను మూడు గంటల్లో అందజేయగలమో ఫ్లిప్ కార్ట్ జాబితా సిద్ధం చేసుకుంటోంది. ఇందుకు అవసరమైన సాంకేతికత, ధరల నిర్ణయం తదితరాలపై ఆలోచిస్తున్నామని ఫ్లిప్ కార్ట్ ప్రతినిధి సుజిత్ కుమార్ తెలిపారు.

  • Loading...

More Telugu News