: రూ. 60 వేల వరకూ పెరిగిన హోండా కార్ల ధరలు


పెరిగిన ఎక్సైజ్ సుంకాల భారాన్ని కొనుగోలుదారులపై మోపాలని హోండా కార్స్ ఇండియా నిర్ణయించింది. ఎంపిక చేసుకొనే మోడల్ ను బట్టి కారు ధర రూ.15 వేల నుంచి రూ.60 వేల వరకూ పెంచినట్టు సంస్థ నేడు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, మారిన ధరలను అనుసరించి ఎంట్రీ లెవల్ కారు బ్రియో ధర రూ.15 వేల నుంచి రూ.18 వేల వరకు పెరిగింది. సెడాన్ అమేజ్ ధర రూ.19 వేల నుంచి రూ.26 వేల వరకు, సిటీ మోడల్ కార్ల ధర రూ.33 వేల నుంచి రూ.46 వేల వరకు, హై-ఎండ్ మోడల్ సీఆర్-వీ ధర రూ 60 వేలు పెరిగింది. ఈ నెల 1వ తేదీ నుంచి దాదాపు అన్ని కార్ల కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలు పెంచిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News