: యూఎస్ కాన్సులేట్ వద్ద ఆందోళన చేపట్టిన లాయర్లు
ఓ అమెరికన్ సంస్థ బీరు టిన్లపై భారత జాతిపిత మహాత్మా గాంధీ చిత్రాలు ముద్రించినందుకు నిరసనగా హైదరాబాద్ లోని ఆ దేశ కాన్సులేట్ వద్ద తెలంగాణ న్యాయవాదులు నేటి మద్యాహ్నం ఆందోళనకు దిగారు. గాంధీని అవమానించినందుకు నిరసనగా, అమెరికా కాన్సులేట్ లోపలికి చొచ్చుకెళ్లేందుకు న్యాయవాదులు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. కనెక్టికట్ కేంద్రంగా పనిచేస్తున్న న్యూ ఇంగ్లాండ్ బ్రూయింగ్ కంపెనీ గాంధీ పేరు, చిత్రాలతో కూడిన బీరు టిన్లను మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అమెరికాలోని భారతీయుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ కంపెనీ క్షమాపణలు చెప్పింది.