: ఎయిర్ ఏషియా విమానంలో వెళ్లేది లేదంటూ తేల్చిచెప్పారు!


ఎయిర్ఏషియా విమానయాన సంస్థకు గడ్డుకాలం ఎదురైనట్టుంది. తమ విమానాల్లో ప్రమాదాలు చోటుచేసుకోవు అంటూ సంస్థ సీఈవో ప్రకటించిన రెండు నెలల్లోనే ఇండోనేషియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. ఆ దుర్ఘటన నుంచి తేరుకోకముందే ఓ విమానం రన్ వే పై నుంచి బురదలోకి జారిపోయింది. తాజాగా, ఎయిర్ ఏషియాకు చెందిన ఈ విమానం సురబయ జువాందా ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ చేస్తుండగా ఒక ఇంజిన్ పనిచేయడం మానేసింది. ఆ ఇంజిన్ నుంచి పెద్ద శబ్దాలు రావడంతో విమానాన్ని పైలట్ తిరిగి ల్యాండ్ చేశాడు. దీంతో విమానంలో ఉన్న 120 మంది ప్రయాణికుల్ని దింపి మరమ్మతులు నిర్వహించారు. విమానం బాగైన తరువాత ట్రయల్ రన్ నిర్వహించిన అనంతరం ప్రయాణికులను తిరిగి విమానంలోకి ఎక్కమని చెప్పగా, 90 శాతం మంది నిరాకరించారు. ఆ విమానంలో తాము ప్రయాణించేది లేదని, ఆ విమానంపై తమకు నమ్మకం లేదని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News