: గుండెజబ్బు నిర్ధారణకు 'హెయిర్‌ టెస్ట్‌'


ఇది ఫెయిర్‌ టెస్ట్‌ అవునా? కాదా? ఇంకా డాక్టర్లు నిర్ణయించాల్సి ఉంది. అయితే.. హెయిర్‌ టెస్ట్‌ అనేది గుండెజబ్బును నిర్ణయిస్తుందని పరిశోధకులు తేల్చిచెబుతున్నారు. వెంట్రుకతో డీఎన్‌ఏ పరీక్ష చేస్తారంటేనే విస్తుపోయిన ప్రపంచానికి.. వెంట్రుకతో పరీక్షలు జరిపి రాబోయే గుండెజబ్బులను కూడా ముందే చెప్పేస్తారని డాక్టర్లు వివరించడం ఓ అబ్బురం. నెదర్లాండ్స్‌ శాస్త్రవేత్తలు ఈ విషయాన్నే చెబుతున్నారు.

రక్తపరీక్ష కంటె కూడా వృద్ధుల్లో వెంట్రుక పరీక్ష గుండెజబ్బు ప్రమాదాన్ని మరింత కచ్చితంగా చెప్పేస్తుందిట. శరీరంలోని ఒత్తిడి ఆధారంగా పరీక్ష నిర్వహిస్తారట. ఒత్తిడి కారకమైన కార్టిసాల్‌ హార్మోన్‌ స్థాయిని మామూలు రక్తపరీక్షలు నిర్దిష్ట సమయం వరకే చెప్పగలవు.. అయితే నెత్తిన ఉండే వెంట్రుకలైతే.. కొన్ని నెలల పాటూ కార్టిసాల్‌లో ఏర్పడ్డ మార్పుల్ని చెప్పగలవట. ఆ మార్పుల్ని అంచనావేస్తే గుండెజబ్బుల రాక ముందుగానే అర్థం చేసుకోవచ్చుననేది నెదర్లాండ్స్‌ శాస్త్రవేత్తల అంచనా.

  • Loading...

More Telugu News