: కుస్తీలో సత్తాచాటిన యోగా గురు బాబా రాందేవ్
బాబా రాందేవ్ యోగాసనాల్లో సిద్ధహస్తుడని అందరికీ తెలుసు. ఆయనలోని 'కుస్తీ వీరుడు' ఇవాళ అందరికీ దర్శనమిచ్చాడు. దివ్య యోగా మందిర్ పేరిట ఆయన నిర్వహిస్తున్న ఆశ్రమం 20వ వ్యవస్థాపక దినోత్సవంలో భాగంగా కుస్తీ బరిలోకి దిగి రాందేవ్ తన ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు. ఆశ్రమం తరపున జాతీయ స్థాయి కుస్తీ, కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఓ ఆటగాడితో కుస్తీ పట్టి తనదైన శైలిలో అందరినీ అలరించారు. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరి, సర్బానంద సోనోవాల్, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ తదితరులు బాబా రాందేవ్ ను ఉత్సాహపరిచారు.