: తమిళనాడులో 'అమ్మ సిమెంట్' పథకం ప్రారంభం


ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలిత ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రి కాకపోయినా తన హవా కొనసాగిస్తూ, ప్రభావం చూపుతున్నారు. తాజాగా 'అమ్మ సిమెంట్' పేరుతో ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించింది. భారీ రాయితీ, తక్కువ ధర, పర్యావరణ అనుకూలంగా ఈ పథకం కింద సిమెంట్ లభ్యమవుతుంది. అమ్మ సిమెంట్ ఒక్కో బస్తా రూ.100లకు లభిస్తుంది. ఈ మేరకు ప్రైవేట్ ఉత్పత్తిదారుల నుంచి రెండు లక్షల టన్నుల సిమెంట్ ను ప్రభుత్వం కొనుగోలు చేసింది. 66 ఏళ్ల తమ అధినేత్రి జయలలితను పార్టీ అభిమానులు 'అమ్మ'గా పిలుచుకుంటున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News