: జమ్మూ కాశ్మీర్ కోసం బీజేపీతో పొత్తు అవసరమంటున్న ఒమర్ అబ్దుల్లా
రాష్ట్ర అవసరాలకోసం బీజేపీ పొత్తు అవసరమని జమ్ము కాశ్మీర్ అపద్ధర్మ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అంటున్నారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఆయన తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. "రాష్ట్రానికి ఇచ్చే రూ.44 వేల కోట్ల వరద సాయాన్ని పొందేందుకు బీజేపీతో పొత్తు అవసరమని పీడీపీకి చెప్పాం" అని ఒమర్ అన్నారు. కాగా, తాను సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని లేవనెత్తినప్పుడు రాజకీయాలు చేస్తున్నానని ఆరోపించారన్నారు. అయితే ఇప్పుడిదే చట్టాన్ని అడ్డుపెట్టుకుని పీడీపీతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం మంచిదే అని ఒమర్ గుర్తు చేశారు.