: బీహార్ సీఎం జితన్ రాం మాంఝిపై బూటు విసిరిన ఆగంతుకుడు


బీహార్ ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝిపై ఓ వ్యక్తి బూటు విసిరాడు. అయితే అదృష్టవశాత్తు బూటు ఆయనకు తగలలేదు. వెంటనే అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సదరు వ్యక్తిని ఛాప్రాకు చెందిన అమితేష్ గా గుర్తించారు. సీఎం మాంఝి కుల రాజకీయాలను ప్రచారం చేస్తున్నారని ఆ వ్యక్తి ఆరోపించాడు. ప్రస్తుతం పోలీసులు అతడిని విచారిస్తున్నారు. ఈ ఉదయం పాట్నాలోని తన నివాసంలో సీఎం జనతా దర్బార్ లో మాట్లాడుతుండగా ఈ ఘటన జరిగింది.

  • Loading...

More Telugu News