: జగన్ కాంగ్రెస్ లో చేరాల్సిన సమయం ఆసన్నమైంది: అజిత్ జోగి
వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిన సమయం ఆసన్నమైందని ఛత్తీస్ గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి అన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి జగన్ తిరిగి రావాలని విజ్ఞప్తి కూడా చేశారు. జగన్ తో పాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మహారాష్ట్రలోని ఎన్సీపీ నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడమో లేక కాంగ్రెస్ కూటమిలో చేరడమో చేయాలని సూచించారు. వివిధ కారణాలతో గతంలో వీరంతా కాంగ్రెస్ కు దూరమయ్యారని... ప్రస్తుతం దానికి అంత ప్రాధాన్యత లేదని... గతాన్ని మర్చిపోయి వీరంతా కాంగ్రెస్ కు చేరువ కావాలని విన్నవించారు. జనతా పరివార్ మాదిరి గతంలో కాంగ్రెస్ తో కలసి పనిచేసిన నేతలంతా ఒక్కటైతే... పార్లమెంటులో వంద మంది ఎంపీల సమూహం తయారవుతుందని జోగి తెలిపారు.