: ఛత్తీస్ గఢ్ లో చరిత్ర సృష్టించిన హిజ్రా
ఛత్తీస్ గఢ్ లో మధు కిన్నర్ అనే హిజ్రా చరిత్ర సృష్టించింది. రాయ్ గఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి తిరుగులేని విజయం సొంతం చేసుకుంది. 9,500 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించింది. పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే విజయం సాధించడంతో మధు కిన్నర్ మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. కాగా, అధికార బీజేపీ అభ్యర్థికి మధు చుక్కలు చూపించింది. తొలి రౌండ్ నుంచే ఆధిక్యంలో నిలిచిన మధు ఏ దశలోనూ ప్రత్యర్ధికి అవకాశం ఇవ్వకుండా విజయం సాధించింది. దీంతో ఛత్తీస్ గఢ్ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన తొలి హిజ్రాగా చరిత్రకెక్కింది.