: అగ్రిగోల్డ్ ఛైర్మన్ ఇంట్లో సోదాలు
అగ్రిగోల్డ్ చైర్మన్ ఇంట్లో సీసీఎస్ పోలీసులు సోదాలు నిర్వహించారు. విజయవాడలోని సత్యనారాయణపురంలో ఆయన స్వగృహంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అగ్రిగోల్డ్ పై తూర్పు, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాలకు చెందిన డిపాజిటర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిపాజిట్లకు మెచ్యూరిటీ గడువు ముగిసినా చెల్లింపులు సక్రమంగా జరపడం లేదని, తమను మోసం చేస్తున్నారని పేర్కొంటూ డిపాజిటర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసులు నమోదు చేసిన పోలీసులు, అతని నివాసంలో సోదాలు నిర్వహించి, పలు డాక్యుమెంట్లు పరిశీలించారు. కాగా, తమకు స్థిరాస్తులు ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అగ్రిగోల్డ్ ఛైర్మన్ వీఆర్ రావు పేర్కొన్నారు. అలా ప్రకటించి నెలలు గడుస్తున్నా ఆయన బకాయిలు చెల్లించడం లేదని బాధితులు పేర్కొంటున్నారు.