: ఆయన నటుడు కాదు...కుటుంబ సభ్యుడు: సురేఖవాణి, హేమ, సన


దివంగత సినీ నటుడు ఆహుతి ప్రసాద్ హఠాన్మరణాన్ని ఆయనకు జోడీగా నటించిన పలువురు నటీమణులు జీర్ణించుకోలేక విలపించారు. ఆయన భౌతికకాయాన్ని సందర్శించిన సందర్భంగా క్యారెక్టర్ ఆర్టిస్టులు, సురేఖవాణి, హేమ, సన తదితర నటీమణులు ఆయనతో తమకున్న అనుభవాల్ని నెమరు వేసుకున్నారు. ఆయన సహనటుడిగా కంటే కుటుంబసభ్యుడిగానే తాము భావిస్తామని వారు పేర్కొన్నారు. సమస్యల్లో ఉంటే తానున్నానంటూ ఆయన భరోసా ఇచ్చేవారని వారు తెలిపారు. సమస్యలు అడిగి తెలుసుకుని ఎన్నో రకాలుగా సాయం చేసేవారని వారు తెలిపారు. సమస్యల్లో ఎవరున్నా 'నేనున్నాను, భయపడకండి' అంటూ ఆహుతి ప్రసాద్ భరోసా ఇచ్చేవారని వారు తెలిపారు. ఆయన లేరనే నిజాన్ని తాము ఇంకా నమ్మలేకపోతున్నామని వారు వెల్లడించారు.

  • Loading...

More Telugu News