: ఎయిరిండియా కార్యాలయానికి బెదిరింపు ఫోన్


ఎయిర్ ఇండియా విమానాన్ని హైజాక్ చేయబోతున్నట్టు కోల్ కతా లోని ఆ సంస్థ కార్యాలయానికి ఓ ఆగంతుకుడు ఫోన్ చేసి బెదిరించాడు. ఆగంతుకుడు క్లుప్తంగా బెంగాలీలో రెండు మాటలు చెప్పి ఫోన్ పెట్టేశాడని సంస్థ ఉద్యోగులు తెలిపారు. ఈ మేరకు వారు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇలాంటి బెదిరింపు కాల్స్ సర్వసాధారణమే అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల రీత్యా తీసుకోవాల్సిన భద్రతా చర్యలన్నీ పకడ్బందీగా తీసుకుంటున్నామని ఎయిర్ ఇండియా అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News