: ‘తుళ్లూరు’ నిందితులను కఠినంగా శిక్షించాలి: వెంకయ్యనాయుడు
నవ్యాంధ్ర రాజధాని ప్రాంత గ్రామాల్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. నేటి ఉదయం విజయవాడలో పింగళి వెంకయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడిన ఆయన ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. అభివృద్ధి నిరోధకంగా వ్యవహరిస్తున్న విపక్షాల తీరుపై విరుచుకుపడిన ఆయన తుళ్లూరు ఘటనను ప్రస్తావించారు. తుళ్లూరు ఘటనను కూడా ఆయన అభివృద్ధి నిరోధక చర్యగానే అభివర్ణించారు. అభివృద్ధి నిరోధకులకు ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన అభిప్రాయపడ్డారు.