: రెండు రోజుల్లో 2,600 ఎకరాలు... భూ సమీకరణకు అనూహ్య స్పందన: కేఈ కృష్ణమూర్తి
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం తమ ప్రభుత్వం చేపట్టిన భూ సమీకరణకు రైతుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి స్వచ్ఛందంగా భూములిచ్చేందుకు రైతులు ముందుకు వస్తున్నారన్నారు. భూ సమీకరణ ప్రారంభించిన రెండు రోజుల్లోనే 2,600 ఎకరాల భూమిని రైతులు ప్రభుత్వానికి అప్పగించారన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే భూ సమీకరణకు శ్రీకారం చుట్టామని ఆయన తెలిపారు.