: గుంటూరు జిల్లాలో దారుణం...మహిళపై కిరోసిన్ పోసి నిప్పంటించిన యువకుడు


గుంటూరు జిల్లాలో నేటి ఉదయం దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళపై కిరోసిన్ పోసిన యువకుడు ఆమెకు నిప్పంటించాడు. ఈ ఘటనలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం మునగపాడులో ఈ ఘటన చోటుచేసుకుంది. యువకుడి దాడిలో తీవ్ర గాయాలపాలైన మహిళను స్థానికులు ఆస్పత్రిలో చేర్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. కొంతకాలంగా బాధిత మహిళను ఆ యువకుడు లైంగికంగా వేధిస్తున్నాడని, అతడికి లొంగని నేపథ్యంలో ఈ దాడికి పాల్పడ్డాడని ప్రాథమిక సమాచారం.

  • Loading...

More Telugu News