: రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు
మహ్మద్ ప్రవక్త జయంతి మిలాద్ ఉన్ నబీ పర్వదినం సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మహ్మద్ ప్రవక్త జీవితం, ఆదర్శాలను గుర్తు చేసుకోవడంతో పాటు ఆయన బోధించిన విశ్వమానవ ప్రేమ, కరుణ ప్రతి ఒక్కరూ ఆచరించదగినవని రాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు. మహ్మద్ ప్రవక్త బోధించిన శాంతి, కరుణ, సహనం, క్షమాగుణాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని ఉపరాష్ట్రపతి తన సందేశంలో ఆకాంక్షించారు.